
కేరళా ప్రభుత్వం రాష్ట్రంలో రెండో శతదినోత్సవ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. రాష్ట్రంలో మరోసారి అభివృద్ది పథకాలను ప్రారంభించనున్నారని. దాదాపు రూ.10 వేలకోట్లతో చేయనున్న అభివృద్ది పథకాలు మొదలు కావడం లేదా పూర్తవడం ఈ వందరోజులలో జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. దీనిని ప్రెస్ నోట్ ద్వారా కేరళా సీఎం ఆఫీసు తెలిపింది. ‘రాష్ట్రంలో రానున్న 100రోజులలో అనేక అభివృద్ది పథకాలు ప్రారంభం కావడం లేదా పూర్తి కావడం జరుగుతోంది. ఈ రెండో శతదినోత్సవ ప్రోగ్రామ్‌లో దాదాపు రూ.10 వేలకోట్లతో అభివృద్ది పథాకాలకు చెక్ పెట్టనున్నాం. రాష్ట్ర ప్రజలకు లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రన్ట్(ఎల్‌డీఎప్) ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ 600వాగ్దానాలను తన మానిఫెస్టోలో ఇచ్చింది. వాటిలో 570 వాగ్దానాలు నెరవేర్చాం. మిగిలినవి అతి త్వరలో పూర్తి చేస్తామ’ని ఎల్‌డీఎస్ నేతలు తెలిపారు. అయితే రాష్ట్రాల మొదటి వందరోజుల ప్రోగ్రామ్ సెప్టంబరు-డిసెంబరు నెలల మధ్యలో తీసుకువచ్చారు.