మధ్యప్రదేశ్ లో మార్చి 31 వరకు పాఠశాలల బంద్

కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు మూతపడ్డాయి. ముఖ్యంగా విద్యారంగంపై ఈ ప్రభావం తీవ్రంగా చూపింది. అయితే అన్ లాక్ నేపథ్యంలో విద్యారంగం మినహా అన్నిరంగాలు తమ పనులను నిర్వహించుకుంటున్నారయి. ఆన్ లాక్ మార్గదర్శకాల ప్రకారం కొన్ని చోట్ల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైనా కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ విద్యాసంస్థలను మూసివేశారు. ఈనేపథ్యంలో మధ్యప్రదేశ్ లో ఈ సంవత్సరం మొత్తం పాఠశాలలను తెరవొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ […]

Written By: Suresh, Updated On : December 5, 2020 2:50 pm
Follow us on

కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు మూతపడ్డాయి. ముఖ్యంగా విద్యారంగంపై ఈ ప్రభావం తీవ్రంగా చూపింది. అయితే అన్ లాక్ నేపథ్యంలో విద్యారంగం మినహా అన్నిరంగాలు తమ పనులను నిర్వహించుకుంటున్నారయి. ఆన్ లాక్ మార్గదర్శకాల ప్రకారం కొన్ని చోట్ల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైనా కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ విద్యాసంస్థలను మూసివేశారు. ఈనేపథ్యంలో మధ్యప్రదేశ్ లో ఈ సంవత్సరం మొత్తం పాఠశాలలను తెరవొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అధికారులతో సమావేశమై పాఠశాలల బంద్ ను మార్చి 31 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. అయితే 10,12వ విద్యార్థులకు మాత్రం తరగతులు నిర్వహించాలని తెలిపారు. అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాతే తరగతులు ప్రారంభించాలన్నారు.