
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని నమోదు చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి-50 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో నమ్మిన బంటు అయిన పీఎస్‌ఎల్వీ వాహక నౌక కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టిందని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు.