
ప్రజా సంక్షేమంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. సోమవారం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి నివాళులర్పిస్తూ ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాల్లో పోలీసులు ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రకృతి విలయం సమయంలోనూ అందరికంటే ముందుండి పోలీసులు సేవ చేస్తారన్నారు. ఇలా ప్రతి సంక్షోభంలో ముందుండడంలో కొందరు అమరులయ్యారని వారికి నివాళులర్పిస్తున్నాని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు.