
దేశంలో కొవిడ్ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ ఉదయం 10.30 గంటలకు వీడియోకానప్ఫరెన్స్ ద్వారా ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్ధన్, ప్రహ్లాద్ జోషీ, అర్జున్ రామ్ మేఘవాల్, వి. మురళీధరన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, శివసేన నుంచి వినాయక్ రౌతు తదితరులు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిసింది.