
ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతోన్న డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ సాధించాడు. ఆసీస్ పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ 123 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీకిది 23వ అర్ధశతకం కావడం విశేషం. కోహ్లీ పరుగుల వేట కొనసాగిస్తుండగా రహానె సహకారం అందిస్తున్నాడు. 67 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ(62), రహానె(18) క్రీజులో ఉన్నారు. పింక్ బాల్ టెస్టులో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు.