Pakistan Vs India: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మళ్లీ పిచ్చికూతలు కూస్తున్నాడు. ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని తమవైపు మళ్లించాయి.
ఆయన చేసిన మూడు స్పష్టమైన హెచ్చరికల్లో ఉన్న సంకేతాలు భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో అంతర్గత గందరగోళాలను ప్రోత్సహిస్తాం.. అణ్వస్త్రాలను వినియోగించేందుకు వెనుకాడం.. భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చే ప్రయత్నాలు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వంకాయ మునీర్‌గాడు. ఈ వ్యాఖ్యలు ఆర్థిక, భద్రతాపరమైన ఒత్తిడి వ్యూహాల కలయికగా కనిపిస్తున్నాయి.
అమెరికా–పాక్ కలిసి డ్రామాలు..
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇటీవల అమెరికా పర్యటనలు పెంచడం, అక్కడి అధికారవర్గాలతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం గమనార్హం. ఆ తర్వాత భారత్‌పై వచ్చిన కఠిన వ్యాఖ్యలు, కొత్త బెదిరింపులు అమెరికా ప్రోత్సాహంతో జరుగుతున్నాయనే అభిప్రాయం విశ్లేషకుల్లో పెరుగుతోంది. భారత్ వేగంగా పెరుగుతున్న ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న తరుణంలో, దానిని అస్థిరపరచడానికి ఆదేశాలు గోప్యంగా పాకిస్తాన్‌కిచ్చినవనే అనుమానం పుట్టిస్తోంది.
ఏప్రిల్‌లో ఇలాగే కూతలు..
గత ఏప్రిల్ 15న మునీర్ చేసిన హెచ్చరికల వెంటనే పహల్గాం ఉగ్రదాడి జరిగింది.
అదే తరహాలో తాజా హెచ్చరికల తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రతా సంస్థలు ఈ వ్యాఖ్యలను సాధారణ రాజకీయ ప్రసంగాలుగా కాక, ముందస్తు సంకేతాలుగా పరిగణిస్తున్నాయి.
ఆర్థికంగా దెబ్బతీసే పరిస్థితి..
పాకిస్తాన్ భారత ఆర్థిక వ్యవస్థను కుదించాలని హెచ్చరించడంలో పెద్ద వ్యూహం దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయడం, మార్కెట్ అస్థిరత సృష్టించడం, అంతర్జాతీయ స్థాయిలో రేటింగ్ ఏజెన్సీలను ప్రభావితం చేయడం వంటి పరోక్ష ప్రయత్నాలు జరగవచ్చని అంచనా.
ట్రంప్‌పై పెరుగుతున్న నిరసనలు
ఇదిలా ఉంటే ఇక అమెరికా అంతర్గత పరిస్థితులు కూడా భిన్నంగా మారుతున్నాయి.
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మీద దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం అవుతున్నాయి. న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజెల్స్‌తోపాటు ఇతర నగరాల్లో కూడా ‘‘తన పాలన నియంత్రణ తప్పుతోందని’’ అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వివాదాస్పద వీడియో మరింత ఆగ్రహానికి దారి తీసింది, ఇది ఆయన మద్దతుదారుల్లో కూడా భిన్నాభిప్రాయాలు రేకెత్తిస్తోంది.
అమెరికా అస్థిరతలో పాకిస్తాన్ ఆశలు
ట్రంప్ పరిపాలనలో ఆర్థిక నియంత్రణలు, పన్ను పెంపులు, విదేశాంగ ద్వంద్వ విధానాలు అమెరికాలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అస్థిరతను ఉపయోగించుకొని పాకిస్తాన్ తన అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని తిరిగి సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
భారత్ గతానికి మించిన ఆర్థిక స్థాయి, అంతర్జాతీయ విశ్వాసం సాధించింది.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్–అమెరికా ప్రేరేపణలకు ప్రతిస్పందన చూపడం కంటే, భద్రతా సిద్ధతను పెంచడంతోపాటు ఆర్థిక వృద్ధిని స్థిరంగా కొనసాగించడం అత్యవసరం.