Dil Raju And Pawan Kalyan: ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రోజులపాటు అహర్నిశలు కష్టపడి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు… వారసత్వం ఉన్నప్పటికి సక్సెస్ లను సాధించడానికి అదేం పనిచేయదు. కేవలం ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి మాత్రమే అవి హెల్ప్ అవుతాయి తప్ప భారీ సక్సెస్ లను సంపాదించి పెట్టడానికి ఏమాత్రం హెల్ప్ చేయవు. ఇక ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం విజయాలను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ అతనికి మంచి ఇమేజ్ ను సంపాదించి పెడుతున్నాయి…ఇక రీసెంట్ గా సుజిత్ దర్శకత్వంలో చేసిన ఊజీ సినిమాతో 400 కోట్ల మార్కును టచ్ చేశాడు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.
ఇక ఈ సినిమా దర్శకుడిగా అనిల్ రావిపూడిని అనుకుంటున్నాప్పటికి తను చేస్తాడా లేదంటే వేరే దర్శకుడికి అప్పజెప్తరా లేదా అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం దాదాపు 120 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
ఇప్పటికే దిల్ రాజు ఈ సంవత్సరం ‘గేమ్ చేంజర్’ సినిమాతో భారీ నష్టాన్ని చవిచూశాడు…స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమా చేయడం కంటే తెలుగులో సినిమాలు చేసుకోవడం బెటర్ అనే స్టేట్మెంట్ ఇచ్చిన దిల్ రాజు సైతం తన ఒపీనియన్ ను మార్చుకొని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు…
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇప్పుడు దిల్ రాజు పవన్ కళ్యాణ్ కాంబోలో చేయబోతున్న సినిమా ఒక సోషల్ మెసేజ్ ను ఇచ్చే మూవీ గా తెరకెక్కుతోందట… ఇక ఈ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…