Mahesh And Rajamouli: మహేష్ బాబు(Super Star Mahesh Babu) అభిమానులు రాజమౌళి(SS Rajamouli) తో తమ అభిమాన హీరో తీస్తున్న సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అధికారికంగా మొదలై ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు కనీసం రాజమౌళి నుండి చిన్న ప్రెస్ మీట్ కూడా లేదు. తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్ ని నిర్వహించి సినిమా కథ ని వివరించే అలవాటు ఉన్న రాజమౌళి, ఇప్పటి వరకు ఎందుకు మహేష్ సినిమా పై నోరు మెదపలేదు అనే కోపం అభిమానుల్లో ఉండేది. వాళ్ళ ఆవేదన ని అర్థం చేసుకొని ఈ ఏడాది ఆగష్టు 9 న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని నవంబర్ నెలలో కనీవినీ ఎరుగని రేంజ్ లో రివీల్ చేస్తామని ఒక ప్రకటన చేశారు.
మరో పది రోజుల్లో నవంబర్ నేలలోకి అడుగుపెట్టబోతున్నాం. మహేష్ ఫ్యాన్స్ కి ఎలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ ఉండుంటాయో ఊహించుకోవచ్చు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి హైదరాబాద్ లో నవంబర్ 11 లేదా నవంబర్ 15న ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారట. దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ త్వరలోనే రానుంది. ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన టైటిల్ ని, ఒక చిన్న గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రం లో పని చేస్తున్న నటీనటులతో పాటు, టెక్నీషియన్స్ కూడా హాజరుకాబోతున్నారు. ఇదే ఈవెంట్ లో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా రివీల్ చేస్తాడట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఈవెంట్ కి ఒక విశిష్ట అతిధి రాబోతున్నారట. అతను మరెవరో కాదు, అవతార్, టైటానిక్ వంటి వెండితెర అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్.
#RRR మూవీ పై గతం లో జేమ్స్ కెమరూన్ ఎలాంటి ప్రశంసల వర్షం కురిపించాడో మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ క్యారక్టర్ తనకు చాలా నచ్చిందని ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చాడు. అప్పటి నుండే రాజమౌళి కి ఆయనతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 3’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఇండియా కి వస్తున్న జేమ్స్ కెమరూన్ ని దయచేసి ఈ ఈవెంట్ కి కూడా రావాలని రిక్వెస్ట్ చేయడం తో, ఆయన అందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి జేమ్స్ కెమరూన్ ఏమి మాట్లాడబోతున్నాడు అనేది. ఇకపోతే ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త.