https://oktelugu.com/

కొనసాగుతున్న బంద్

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరాఠా అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంపై స్థానిక కన్నడీయులు శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. ఆటో, ట్యాక్సీ యూనిట్లు మాత్రం మద్దతు ప్రకటించాయి. అయితే కొన్ని వాణిజ్య సముదాయాలు  తాము బంద్ పాటించమని చెప్పారు. ఈ నేపథ్యంలో దుకాణాలు తెరిచిన ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తాను కన్నడీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని, వారి కోసం ఏదైనా […]

Written By: , Updated On : December 5, 2020 / 09:50 AM IST
Follow us on

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరాఠా అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంపై స్థానిక కన్నడీయులు శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. ఆటో, ట్యాక్సీ యూనిట్లు మాత్రం మద్దతు ప్రకటించాయి. అయితే కొన్ని వాణిజ్య సముదాయాలు  తాము బంద్ పాటించమని చెప్పారు. ఈ నేపథ్యంలో దుకాణాలు తెరిచిన ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తాను కన్నడీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్సు సేవలు కొనసాగుతాయని, ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. నవంబర్ 14న మరాఠా అభివ్రుద్ధి అథారిటీ ఏర్పాటు, వారి అభివ్రుద్ధి కోసం రూ.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో కన్నడీయులు ఆగ్రహం చెంది బంద్ కు పిలుపునిచ్చారు.