https://oktelugu.com/

టీఆర్ఎస్ మేయర్ వ్యూహం ఏంటి?

జీహెచ్ఎంసీలో హంగ్ వచ్చేసింది. ఏపార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇప్పుడు టీఆర్ఎస్, ఎంఐఎం కలిస్తేనే మేయర్ పీఠం దక్కుతుంది. ఎక్స్ అఫీషియో ఓట్లతోనే టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కదు. టీఆర్ఎస్, ఎంఐఎం సహకరించుకోపోతే ఇద్దరికీ దక్కదు. మరి వీరిద్దరూ కలుస్తారా? పొత్తు పొడుస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ బలంగా తయారైన వేళ వాటి బద్ద శత్రువులైన టీఆర్ఎస్, ఎంఐఎంల పొత్తు ఎత్తులు.. సాధ్యమేనా? ఏం జరుగనుందనేది ఆసక్తిగా మారింది.. Also Read: జిహెచ్ఎంసి ఫలితాల […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2020 / 09:57 AM IST
    Follow us on

    జీహెచ్ఎంసీలో హంగ్ వచ్చేసింది. ఏపార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇప్పుడు టీఆర్ఎస్, ఎంఐఎం కలిస్తేనే మేయర్ పీఠం దక్కుతుంది. ఎక్స్ అఫీషియో ఓట్లతోనే టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కదు. టీఆర్ఎస్, ఎంఐఎం సహకరించుకోపోతే ఇద్దరికీ దక్కదు. మరి వీరిద్దరూ కలుస్తారా? పొత్తు పొడుస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ బలంగా తయారైన వేళ వాటి బద్ద శత్రువులైన టీఆర్ఎస్, ఎంఐఎంల పొత్తు ఎత్తులు.. సాధ్యమేనా? ఏం జరుగనుందనేది ఆసక్తిగా మారింది..

    Also Read: జిహెచ్ఎంసి ఫలితాల సారాంశం/పాఠాలు

    మజ్లిస్ తో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. హిందువులను గులాబీ పార్టీకి దూరం చేసేలా బీజేపీ వ్యవహరించవచ్చు.అందుకే మజ్లిస్ తో పొత్తుపై టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. మజ్లిస్ నేరుగా మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ కు గైర్హాజరు అయ్యేలా కేసీఆర్ ప్లాన్ చేసినట్టు  తెలుస్తోంది.

    మేయర్ ఎన్నిక నాడు ఆ రోజున హాజరయ్యే సభ్యుల్లో సభ్యుల్లో మెజారిటీ ఉన్న పార్టీ అభ్యర్థిని మేయర్ గా ఎన్నుకుంటారు. తర్వాత మేయర్ ఎన్నిక కూడా ఇలాగే సాగుతోంది. టీఆర్ఎస్ కు మజ్లిస్ నేరుగా మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ కు గైర్హాజరైనా సరే మేయర్ పదవి టీఆర్ఎస్ కు సులభంగా లభిస్తుంది. ఈ అంశంపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    Also Read: మేయర్ రేసులో ‘ఆ నలుగురూ..’ లాబీయింగ్.. కేసీఆర్ దే ఫైనల్

    మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లో బీజేపీ ఎదగకుండా నిలువరిస్తామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లతో చర్చించి మేయర్ పీఠంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఏంటనేది తెలుసుకొని స్పందిస్తామని ఓవైసీ తెలిపారు.

    దీన్ని బట్టి గ్రేటర్ మేయర్ పీఠం విషయంలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. బీజేపీ దూసుకొస్తున్న వేళ ఎంఐఎంతో కేసీఆర్ ఎలా వ్యవహరిస్తాడన్నది ఆసక్తిగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్