కేంద్ర వ్యవసాయ చట్టాలతోరైతులకు అన్యాయం జరగదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. రైతులతో చర్చలు జరగపోతే దుష్ర్పచారం జరుగుతుందని ఆయన తెలిపారు. అందువల్ల రైతులు చర్చలకు సహకరించాలని అన్నారు. చట్టాల గురించి రైతులు పూర్తిగా వివరించి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇక రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్, ట్రేడర్ సహా ఎక్కడైన విక్రయించుకునే విధంగా స్వేచ్ఛ బిల్లలు అందిస్తాయన్నారు. దేశంలో ఇథనాల్ వినియోగం పెంచాలని తద్వారా రైతులకు లాభం జరుగుతుందన్నారు. ఇథనాల్ రూ. 2 లక్షల కోట్ల ఎకానమీ సాధిస్తే వాటిలో సగం రైతుల జేబుల్లోకి వెళుతుందన్నారు.