https://oktelugu.com/

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. 2022 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది..!

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా ఎంట్రీతో అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రపంచ దేశాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదలేవగా.. అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. క్రీడారంగం సైతం కోలుకోలేని విధంగా మారింది. Also Read: ఐపీఎల్ లో ధోనీ ఆల్ టైం రికార్డు! ఇప్పుడిప్పుడే క్రీడా పోటీలు కొన్ని దేశాల్లో తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇటీవలే బీసీసీఐ దుబాయ్ లో ఐపీఎల్-2020ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించి విజయంతం చేసింది. ఐపీఎల్-2020 తర్వాత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2020 4:59 pm
    Follow us on

    2022 Cricket World Cup
    చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా ఎంట్రీతో అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రపంచ దేశాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదలేవగా.. అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. క్రీడారంగం సైతం కోలుకోలేని విధంగా మారింది.

    Also Read: ఐపీఎల్ లో ధోనీ ఆల్ టైం రికార్డు!

    ఇప్పుడిప్పుడే క్రీడా పోటీలు కొన్ని దేశాల్లో తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇటీవలే బీసీసీఐ దుబాయ్ లో ఐపీఎల్-2020ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించి విజయంతం చేసింది. ఐపీఎల్-2020 తర్వాత పలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు ప్రారంభమయ్యారు.

    స్టేడియంలోకి ప్రేక్షకులను సైతం అనుమతి ఇస్తున్నారు. గతంలో కరోనా ఎంట్రీతో వాయిదా పడిన ప్రపంచ కప్ టోర్నీలను ఐసీసీ తిరిగి నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే మహిళల వన్డే ప్రపంచ కప్ ను 2022లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది.

    Also Read: వన్డే సిరీస్ పాయే..టీంఇండియా టీంలో అనూహ్య మార్పులు?

    న్యూజిలాండ్ వేదికగా 2022 మార్చి 4 న ఈ టోర్నీ ప్రారంభం కానుందని ఐసీసీ ప్రకటించింది. ఇక భారత్ జట్టు మార్చి 8న తొలి మ్యాచ్ ఆడనుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం మొత్తం 8జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే భారత్.. న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికా జట్లు వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాధించాయి.

    ఇక మిగిలిన మూడు జట్ల కోసం పది దేశాలు పోటీపడుతున్నారు. శ్రీలంక వేదికగా ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో ఈ పది జట్లు పోటీపడి అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాచులు ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం ఐసీసీ ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం.