దూసుకొస్తున్న ‘నివర్’..: ఏపీ, తెలంగాణలో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నివర్’ తుఫానుగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో నివర్ కేంద్రీక్రుతమైంది. దీంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సూచించింది. కాగా ఈ […]

Written By: Suresh, Updated On : November 24, 2020 1:24 pm
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నివర్’ తుఫానుగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో నివర్ కేంద్రీక్రుతమైంది. దీంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సూచించింది. కాగా ఈ తుఫాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిపై అధికంగా ప్రభావం ఉంటుందన్నారు.