
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 44,684 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 520 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,29,188కి చేరింది. ప్రస్తతం దేశంలో 4,80,719 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 81,63,572 గా ఉంది. గత పది రోజులుగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి.