
భారత్ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రుకు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఆయన ఢిల్లీలోని శాంతివనంలో నెహ్రు సమాధి వద్ద పుష్పాంజలి ఉంచారు. సాధారణంగా పాఠశాలలు సక్రమంగా సాగితే ఈరోజు బాలల దినోత్సవాన్ని గడుపుకుంటారు. నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రకటించారు. అయితే కరోనా కారణంగా పాఠశాలలు ప్రారంభం కానందున బాలల దినోత్సవాన్ని అందరూ మరిచారు. కాగా నెహ్రు భారతదేశానికి చేసిన సేవలను రాహుల్ గాంధీ గుర్తు తెచ్చకున్నారు.