
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా (93) సోమవారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధ సమస్యతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా మోతీలాల్ ఆదివారమే తన 93వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుల్లో తరుణ్‌గొగొయి, అహ్మద్‌పటేల్ మరణం తర్వాత నెల వ్యవధిలోనే వోరా మరణం మూడోది కావడం గమనార్హం.