
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ కు భారత ప్రధాని మోడీ ఫోన్ లో అభినందనలు తెలిపారు. భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై తమ నిబ్ధతతను పునరుద్ఘాటించామని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఇండో, పసిఫిక్ వంటి ప్రాంతంలో సహకారంపై బైడెన్ తో మాట్లాడినట్లు మోడీ ట్వట్టర్ లో పేర్కొన్నారు. 2016లో అమెరికా పర్యటించినటనప్పడు అక్కడి సమావేశానికి బైడెన్ అధక్షత వహించారని మోడి గుర్తు చేశారు. బైడెన్ గెలుపుతో అమెరికాలో ప్రజాస్వామ్య విలువల బలము, సమర్థతకు నిదర్శనమని అన్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే మోడీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు కూడా శుభాకాంక్షలు తెలిపారు.