అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రూపొందించిన కిట్ ద్వారా ఇప్పడు కరోనా టెస్టును ఎవరికి వారే చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ సంస్థ రూపొందించిన ‘లూసిరా కోవిడ్ -19’ కిట్ ద్వారా పరీక్ష ఎలా చేసుకోవాలో కూడా తెలిపింది. అయితే దీనిని మెడికల్ షాపులో నేరుగా కాకుండా వైద్యుల సూచన మేరకు కొనుగోలు చేయాలని ఆ సంస్థ తెలిపింది.
తొలుత గొంతు నుంచి స్వాబ్ తీసి, అనంతరం కిట్ తో వచ్చే సీసాలో కొద్ది సేపు ఉంచాలి, ఆ తరువాత కిట్ లో ఉండే ఎల్ఈడీ బల్బ్ రంగులోకి మారుతుంది. ఆ రంగును బట్టి కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు. అయితే ఏ రంగు వస్తే కరోనా పాజిటివో, ఏ రంగు వస్తే నెగటివ్ అనేది వైద్యులు తెలుపుతారు. కరోనా ప్రారంభం నుంచి అనేక మంది టెస్టుల కోసం ఎన్నో ప్రయాసలు పడాల్సి వచ్చింది. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్న ప్రజలు ఆ తరువాత ప్రైవేట్ ఆసుపత్రల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే కొందరు చెస్ట్ స్కానింగ్ ద్వరా నిర్దారించుకుంటున్నారు. తాజాగా ఈ కిట్ తో ఆసుపత్రికి వెళ్లకుండా పరీక్ష చేయించుకునే వీలు కలుగుతుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Afdo devloped new kit for cororna test
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com