
కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని సొగసుగా వినియోగిస్తోందని, ఘోరంగా దుర్వినియోగం చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన తాజా లేఖపై మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, డీజీపీకి పంపిన లేఖలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సెంట్రల్ డిప్యూటేషన్‌కు పంపించాలని ఇంతకుముందు జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని పేర్కొంది. ఐపీఎస్ కేడర్ రూల్స్‌లోని సెక్షన్ 6(1) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై అంగీకారం కుదరకపోతే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే అమలవుతుందని తెలిపింది.