
రైతుల్ని చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు రైతు సంఘాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.’చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై వెళ్లాలా వద్దా అనే అంశంపై బుధవారం నిర్ణయం తీసుకుంటాం. కేంద్రం రాసిన లేఖలో కొత్త అంశాలేవీ లేవు. ఇకముందు ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాం. జనవరి 26న భారత్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వస్తున్న నేపథ్యంలో.. ఆయనను రావద్దని బ్రిటన్ ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయించాం. రైతుల డిమాండ్లను కేంద్రం ఒప్పుకునే వరకు భారత్ పర్యటనకు రావొద్దని లేఖ పంపుతాం’ అని రైతు సంఘాలనేతలు హెచ్చరించారు.