
ఏరోస్పేస్ ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ రొడ్డం నరసింహం అనారోగ్యంతో కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావవడంతో ఆయనను బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. అంతరిక్ష పరిశోధకుడు సతీష్ ధవన్ కు ఆయన మొదటి శిష్యుడు. ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ సీఎన్ రావుకు మంచి స్నేహితుడు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో నరసింహ పనిచేశారు. కలాంతో కలిసి ‘ డెవలప్ మెంట్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ‘ అనే పుస్తకాన్ని రచించారు. కాగా నరసిహ మరణంపై ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. భారత్ లో సైన్స్ అభివ్రుద్ధికి నరసింహం ఎంతో అభివ్రుద్ధి చేశాడని కొనియాడారు.