శశికళకు కర్ణాటక హైకోర్టు షాక్‌

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు కర్నాటక హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. త్వరలోనే శశికల విడుదల కానుందని ఇటీవల ప్రచారం బాగా నడిచింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ కర్ణాటక హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. జయలలితకు సన్నిహితురాలిగా పేరుగాంచిన శశికళ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. ఇటీవలే తన శిక్ష కాలాన్ని తగ్గించాలని అధికారులకు శశికళ దరఖాస్తు చేసుకున్నారు. […]

Written By: Suresh, Updated On : December 5, 2020 7:21 pm
Follow us on

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు కర్నాటక హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. త్వరలోనే శశికల విడుదల కానుందని ఇటీవల ప్రచారం బాగా నడిచింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ కర్ణాటక హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. జయలలితకు సన్నిహితురాలిగా పేరుగాంచిన శశికళ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. ఇటీవలే తన శిక్ష కాలాన్ని తగ్గించాలని అధికారులకు శశికళ దరఖాస్తు చేసుకున్నారు. జరిమానా రూ.10 కోట్లను ఆమె చెల్లించారని, దాంతో జనవరిలో ఆమె విడుదల కావొచ్చని ప్రచారం జరిగింది. శశికళ వర్గంలోనూ కొన్నిరోజులుగా ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. అయితే కర్ణాటక హైకోర్టు నిర్ణయంతో ఈ ప్రచారానికి తెరపడడంతో శశికళ వర్గంలో నిరుత్సాహం నెలకొంది.