https://oktelugu.com/

అవినాష్ ని కాలితో తన్నిన మోనాల్, నాగార్జున వద్దకు పంచాయితీ..!

ఈ వారం బిగ్ బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ ప్రారంభించడం జరిగింది. ఇంటిలోని ఒక సభ్యుడు నేరుగా బిగ్ బాస్ ఫైనల్ కి చేరే అవకాశం ఉందని చెప్పాడు. టికెట్ టు ఫినాలే గెలవడం కోసం బిగ్ బాస్ నిర్వహించే వివిధ టాస్క్ లలో గెలవాలని చెప్పడం జరిగింది. దీని కోసం మొదటి టాస్క్ గా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న బొమ్మ ఆవు నుండి పాలు సేకరించాలని, అత్యధిక పాలు సేకరించి, బాటిల్స్ […]

Written By:
  • admin
  • , Updated On : December 5, 2020 / 07:17 PM IST
    Follow us on


    ఈ వారం బిగ్ బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ ప్రారంభించడం జరిగింది. ఇంటిలోని ఒక సభ్యుడు నేరుగా బిగ్ బాస్ ఫైనల్ కి చేరే అవకాశం ఉందని చెప్పాడు. టికెట్ టు ఫినాలే గెలవడం కోసం బిగ్ బాస్ నిర్వహించే వివిధ టాస్క్ లలో గెలవాలని చెప్పడం జరిగింది. దీని కోసం మొదటి టాస్క్ గా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న బొమ్మ ఆవు నుండి పాలు సేకరించాలని, అత్యధిక పాలు సేకరించి, బాటిల్స్ లో నింపిన నలుగురు సభ్యులు మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి వెళతారని చెప్పాడు. ఈ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య గొడవలు, తోపులాటలకు దారితీసింది.

    Also Read: సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’ ఫస్ట్‌ లుక్..

    బొమ్మ ఆవు నుండి పాలు సేకరించే క్రమంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఈ టాస్క్ లో అవినాష్ ని మోనాల్ కాలితో తన్నింది. దీనితో మోనాల్ తనను కాలితో తన్నిందని అవినాష్ ఆవేదన చెందాడు. మొదట్లో ఈ విషయంలో మోనాల్ కి సప్పోర్ట్ చేసిన అఖిల్, సోహైల్ ఆ తరువాత అది కరెక్ట్ కాదని అన్నారు. నువ్వు నిజంగా కాలితే తన్నితే అవినాష్ కి సారీ చెప్పని వాళ్ళు సలహా ఇచ్చారు. మొదట తన్నలేదని అన్న మోనాల్, తరువాత నాకు క్లారిటీ లేదు… కావాలని తన్నలేదని మాటలు మార్చింది.

    Also Read: బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ లిస్ట్ లో ఎన్టీఆర్, మహేష్, చరణ్..!

    చివరకు అవినాష్ దగ్గరకు వచ్చి కావాలని చేయలేదని, కాళ్లు పట్టుకోబోయింది. దానితో ఈ పంచాయితీ ముగియగా నేడు హోస్ట్ నాగార్జున ఈవిషయాన్ని లేవనెత్తాడు. ఎప్పటిలాగే నాగార్జున ప్రశ్నకు మోనాల్ కన్నీళ్లతో సమాధానం చెప్పింది. అవినాష్ మాత్రం తాను ఆరోపణలకు కట్టుబడి, మోనాల్ తనను కావాలనే తన్నిందని చెప్పాడు. దీనిపై ఇద్దరి వాదనలు వేరుగా ఉండగా, నాగార్జున ఆ రోజు జరిగిన వీడియో ప్లే చేయమని అడిగాడు. బిగ్ బాస్ తాజా ప్రోమోలో ఈ వివాదం ఆసక్తి రేపుతోంది. నిజంగా ప్రూవ్ అయితే శిక్ష ఏమిటనేది చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్