
ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త మోషెన్ ఫక్రీజాదే దారుణ హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో శుక్రవారం తన వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై కొందరు కాల్పలు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇరాన్ లోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా పనిచేసిన మోషెన్ హత్యలో ఇజ్రాయెల్ పాత్ర ఉన్నట్లు ఇరాన్ దేశం ఆరోపిస్తోంది. గత పదేళ్ల నుంచి ఇరాన్ కు చెందిన శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమారుస్తుందని పేర్కొంటోంది. అయితే ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. కాగా ఇరాన్లో కోవర్ట్ న్యూక్లియర్ ప్రొగ్రామ్లో ఫక్రిజాదేకు సంబంధం ఉన్నట్లు ఇంటెనలీజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.