India Vs Bangladesh: భారత ప్రధానిగా నరేంద్రమోదీ మొదటి సారి ఎన్నికైన తర్వాత పాకిస్తాన్.. పుల్వామా దాడికి తెగబడింది. సైనికులను పొట్టన పెట్టుకుంది. దీంతో పాకిస్తాన్‌ను అడుక్కు తినేలా చేస్తామని మోదీ ఆరోజే ప్రతినబూనారు. దీంతో భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇప్పుడు దాదాపు అడుక్కుతినే పరిస్థితిలోనే ఉంది. అప్పు చేయనిదే రోజు గడవని స్థితి. ఆ దేశం సరసన మరో ముస్లిం దేశం చేరబోతోంది. భారత్‌తో సత్సంబంధాలను తెంచుకుని పాకిస్తాన్, చైనా అండగా ఉంటాయని విర్రవీగుతోంది. దీంతో భారత్ కూడా ఆదేశానికి తగిన రీతిలోనే సమాధానం ఇస్తోంది. ఆ దేశమే బంగ్లాదేశ్. ఇండియా–బంగ్లాదేశ్ మధ్య ఒకప్పుడు ఉన్న సృహృద్భావ వాతావరణం ఇప్పుడు లేదు. ఏడాది క్రితం వరకు వ్యాపార, రాజకీయ పరంగా దగ్గరగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య అపరిచిత దూరం ఏర్పడింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, కొత్త తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు మారిపోయాయి.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
మసకబారిని సంబంధాలు..
తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహ్మద్ యూనస్ తీసుకున్న విధానాలు రెండు దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. చైనా, పాకిస్తాన్‌ల వైపు బంగ్లాదేశ్ మొగ్గు చూపడం న్యూఢిల్లీని ఆందోళనకు గురిచేసింది. ఫలితంగా భారత్ బంగ్లాదేశ్‌కు బియ్యం ఎగుమతిని తగ్గిస్తూ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. మునుపు భారత్ బంగ్లాదేశ్‌కు కిలో బియ్యాన్ని రూ.30–32కే సరఫరా చేసేది. కానీ తాజాగా బంగ్లాదేశ్ యూఏఈ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఎడారి దేశమైన యూఏఈ అక్కడి రైతులు పండించని బియ్యాన్ని భారత్ నుంచి కొనుగోలు చేసి మరింత ధరకు బంగ్లాదేశ్‌కి విక్రయిస్తోంది. ఈ కారణంగా బంగ్లాదేశ్ ప్రస్తుతం కిలోకు రూ.40–42 చెల్లించి బియ్యం దిగుమతి చేసుకుంటోంది. అంటే ప్రతీ కిలోపై దాదాపు రూ.10 అదనపు భారం పడుతోంది. లక్ష టన్నుల దిగుమతితో కోట్ల రూపాయల నష్టం వస్తోంది.
నీడనిచ్చే చెట్టును నరుక్కుని..
నోబెల్ బహుమతి విజేత అయిన మహ్మద్ యూనస్, తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా దేశ ఆర్థిక స్థితిని స్థిరపరచాలన్న సంకల్పం చెప్పుకుంటున్నా, ఆయన తీసుకున్న విదేశాంగ నిర్ణయాలు విరుద్ధ ఫలితాలు ఇస్తున్నాయి. పొరుగు దేశాలపై విమర్శణాత్మక ధోరణి, అనుచిత వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌కు గణనీయమైన నష్టం తెచ్చిపెడుతున్నాయి. నీడను ఇచ్చే చెట్టును నరుక్కుంటే పరస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు యూనస్‌కు అర్థమవుతుంది. భారత్‌తో విభేదాల నేపథ్యంలో బంగ్లాదేశ్ చేపల ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా భారత్ బియ్యం ఎగుమతిని ఆపడం ఆర్థిక పరంగా ‘టిట్ ఫర్ టాట్’ నిర్ణయమని వ్యాపార విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటి పరిణామాలు సూచిస్తున్నది ఒక్కటే. భారత్‌తో సత్సంబంధాలు లేకుండా బంగ్లాదేశ్ తన ఆహార భద్రత నేరవేర్చుకోలేదు. యూనస్ ప్రభుత్వం విదేశీ సమీకరణలను పునరాలోచించకపోతే, ఆర్థిక పరాభవం మరింత లోతుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.