Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా ఎదిగాడు. తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ సిక్స్ హీరోల్లో తను కూడా ఒకరు గా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చాయి. కానీ ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు అతనికి వరల్డ్ వైడ్ గా గుర్తింపును సంపాదించి పెట్టబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు…
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
కెరియర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు తో పాటు చాలామంది హీరోలు పోటీపడ్డారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెడుతూ మహేష్ బాబు విపరీతంగా కష్టపడి మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని వరుస సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అతనితో పోటీ పడిన హీరోల్లో తరుణ్, ఉదయ్ కిరణ్, నితిన్, సుమంత్ లాంటి హీరోలు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా టాప్ హీరో రేంజ్ ను టచ్ చేయలేకపోయారు.
ఉదయ్ కిరణ్, తరుణ్ ఇద్దరు మొదట్లో మంచి విజయాలను సాధించినప్పటికి ఆ తర్వాత పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ల కెరీర్ ను కోల్పోయారు. ఆ తర్వాత నితిన్ కూడా చాలావరకు మహేష్ బాబుకి పోటీ ఇచ్చాడు కానీ ఒకటి రెండు సక్సెసు లు వచ్చిన తర్వాత ఆయన సినిమా ఎంపికలో లోపాలు ఉండడం తో వరుసగా ఫ్లాప్ వచ్చాయి. ఇక నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో మంచి విజయాలను అందుకున్నాడు.
టాప్ హీరో రేంజ్ కు వెళ్తారని అనుకున్నప్పటికి ఆయన ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ప్రస్తుతం వీళ్ళందర్నీ పక్కన పెట్టిన మహేష్ బాబు 50 సంవత్సరాల వయసులో కూడా అలసిపోకుండా చాలా బాగా కష్టపడుతూ తన అభిమానుల్లో ఆనందాన్ని చూడడానికి అడ్వెంచర్లను సైతం అలవోకగా చేసేస్తున్నాడు…