AP Cyclone Victims: ప్రజలను కలుసుకునేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు రాజకీయ పార్టీల నేతలు. ముఖ్యంగా ప్రజలు బాధల్లో ఉంటే వారిని పరామర్శించి.. వారి వద్ద ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భారీ విపత్తు సమయంలో ప్రజల మధ్యకు రావాల్సిన ప్రతిపక్ష పార్టీలు సైలెంట్ గా ఉన్నాయి. కుంటి సాకులు చెబుతూ ప్రజలకు దూరంగా ఉంటున్నాయి. విమాన సర్వీసులు రద్దు అని చెప్పి రావడం మానేశారు జగన్మోహన్ రెడ్డి. అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సైతం ఎక్కడున్నారో తెలియడం లేదు. వామపక్ష పార్టీలు ఉన్న పెద్దగా ఉనికి లేదు. దీంతో ఎటు చూసినా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి పార్టీల నేతలే కనిపిస్తున్నారు.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
* ప్రతిపక్ష పాత్ర కీలకం..
సాధారణంగా తుఫాన్ బాధితులకు ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం స్పందిస్తుంది. ప్రతిపక్ష నేతలు( opposition leaders ) డిమాండ్ చేస్తేనే కొన్ని రకాల పరిహారాలు మంజూరు అవుతాయి. అదే సమయంలో తుఫాన్ సహాయ చర్యలు కూడా వేగంగా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఆది నుంచి ప్రభుత్వ హవా కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నాటి నుంచి అప్రమత్తం అయ్యింది చంద్రబాబు సర్కార్. అనుక్షణం ప్రజల కోసం తప్పిస్తూ సాగారు. ఈ క్రమంలో వారికి విపరీతమైన మీడియా కవరేజ్ కూడా దక్కింది. అదే సమయంలో తుఫాన్ తీరంపై విరుచుకు పడడం, ముందస్తు సహాయ చర్యలతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాన్ వదిలి మూడు రోజులు గడుస్తున్న విపక్ష నేతలు ఎవరు తుఫాన్ బాధిత గ్రామాల్లో కనిపించడం లేదు. దీనిపై ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది.
* కనిపించని షర్మిల..
వాస్తవానికి తుఫాన్ సహాయ చర్యలతో పాటు ముందస్తు అప్రమత్తత చర్యల పట్ల ప్రభుత్వంపై ఒక రకమైన సంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. అదే సమయంలో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా షర్మిల( Y S Sharmila ) లాంటి మహిళ నేత కూడా కనిపించకపోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. వైసీపీ నేతలు కనిపించినా.. వారు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. దీంతో జనాలు వారిని లెక్కలోకి తీసుకోలేదు. ఇంకోవైపు సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కోటి రూపాయలు కేటాయించింది. వాటితో పనులు చాలా వేగవంతం అయ్యాయి. అయితే ఎక్కడ ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు పంట నష్టం అంటూ ప్రకటనలకే పరిమితం అయితే మాత్రం ప్రజల్లో మరింత చులకన కావడం ఖాయం.