China PL 15 Missile: పూర్వకాలంలో జేమ్స్ బాండ్ సినిమాలు విడుదలైనప్పుడు.. అందులో జేమ్స్ బాండ్ పాత్రధారి విచిత్రంగా వ్యవహరించేవాడు. చివరికి తన వెంట్రుకలు కూడా ప్రత్యర్ధులు సొంతం చేసుకోకుండా చాకచక్యంగా వ్యవహరించేవాడు. జుట్టు విషయంలో కూడా జేమ్స్ బాండ్ అంత జాగ్రత్తగా ఎందుకు ఉంటున్నాడు సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే శత్రువులకు ఏమాత్రం చిన్న ఆధారం దొరికినా సరే వారు చేయాల్సిన నష్టం చేస్తారు. అందుకే జేమ్స్ బాండ్ పాత్రధారితో అలా సన్నివేశాలను రూపొందించేవారు.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
ఇటీవల కాలంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యాడు. అనేక అంశాల గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తన మలాన్ని కూడా పుతిన్ వ్యక్తిగత సిబ్బందితో వెంట తీసుకుని వెళ్లిపోయాడు. దీనికి ప్రత్యేకంగా కారణాలు ఏమున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు.
మన శత్రువుకు మన గురించిన ఏ సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఇవ్వకూడదు. అలా తెలుసుకుంటే శత్రువు ఏ కోణం లో అయినా సరే దాడి చేస్తాడు. ఇబ్బంది పెడతాడు. చివరికి ప్రాణాలు కూడా తీస్తాడు. అందువల్లే సాధ్యమైనంతవరకు మనకు సంబంధించిన ఎటువంటి ఆధారాన్ని కూడా వదిలిపెట్టకూడదు.
వర్తమాన కాలంలో ఏ దేశం కూడా ప్రత్యర్థి దేశం వద్ద తమకు సంబంధించిన విషయాలను చెప్పడానికి ఒప్పుకోదు. తమ దేశ భద్రత నుంచి మొదలుపెడితే పౌరుల వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఇదే పాకిస్తాన్ కు అర్థమైనట్టు లేదు. చివరికి పాకిస్తాన్ చేసిన తప్పు వల్ల చైనా జట్టు భారత్ చేతికి చిక్కింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది.
ఇటీవల ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టింది. ఈ సమయంలో మన దేశాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి చైనా సహకారం కూడా కోరింది. చైనాలో రూపొందించిన ఒక మిస్సైల్ ను మనమీద ప్రయోగించడానికి పాకిస్తాన్ సిద్ధమైంది. అనుకున్నట్టుగానే దానిని మన మీదికి ప్రయోగించింది. అయితే అది ఫెయిల్ అయింది. ఈ క్రమంలో ఆ మిస్సైల్ ను మన దేశ శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అందులో ఉన్న కీలక పరిజ్ఞానాన్ని సంపాదించారు. ఆ మిస్సైల్ స్ట్రెంత్, వీక్నెస్ మొత్తాన్ని గుర్తించారు. ఈ ప్రకారం మన మిస్సైల్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు మనమీదికి చైనాలో తయారైన పీఎల్ 15 మిస్సైల్ ను పాకిస్తాన్ ప్రయోగించింది. గగన తలం నుంచి గగన తలంలోని దృశ్య పరిధి అవతలి లక్ష్యాలను ఈ మిస్సైల్ చేదించగలుగుతుంది. ఈ అధునాతన మిస్సైల్ 145 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీనిని చైనా తయారీ జేఎఫ్ 17, జె 10 సీ యుద్ధ విమానం నుంచి పాకిస్తాన్ ప్రయోగించిందని తెలుస్తోంది. టార్గెట్ ఫినిష్ చేయడంలో పీఎల్ 15 విఫలమైంది. ఇది పంజాబ్ రాష్ట్రంలోని హోషియాల్ పూర్ ప్రాంతంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో పడిపోయింది. దీనిని మే నెల తొమ్మిదిన భారత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తదుపరి విశ్లేషణ కోసం శాస్త్రవేత్తలకు అందజేశాయి.
గగన తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేదించడానికి పాకిస్తాన్ దీనిని మన మీదికి ప్రయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇటువంటి మిస్సైల్స్లో సెల్ఫ్ డిస్ట్రోయడ్ వ్యవస్థ ఉంటుంది. ఇటువంటి వ్యవస్థను భారత్ కూడా తాను రూపొందించే మిస్సైల్స్ లో ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రత్యర్థి దేశానికి మన సాంకేతికత ఏమాత్రం అర్థం కాదు. అయితే చైనా రూపొందించిన పి.ఎల్ 15 లో ఇటువంటి వ్యవస్థ లేదు. అది మన దేశ నిపుణులకు దొరికింది.
దీనిని మన దేశ శాస్త్రవేత్తలు అనేక విధాలుగా పరిశీలించారు. అందులో అనేక అంశాలు శాస్త్రవేత్తలను ఆసక్తికి గురిచేసాయి.
ఇందులో చిన్నపాటి “యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్ డ్ అర్రే” రాడార్ ఉంది. Missiles లో ఇటువంటి వ్యవస్థను భారతదేశం ఇంకా డెవలప్ చేయలేదు.
ఇందులో ఉన్న రాకెట్ డ్యూయల్ పల్స్ మోటార్ తో పనిచేస్తూ ఉంటుంది. ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగాన్ని ఇది అందుకోవడానికి దోహదం చేస్తుంది.
మిస్సైల్ కు ఎటువంటి మార్గదర్శకమైన సంకేతాలు అందకుండా ఉండడానికి.. ప్రత్యర్థి ప్రయోగించే ఎలక్ట్రానిక్ జామింగ్ విధానాలను దాటి వెళ్లడానికి దీనికి సామర్థ్యం ఉంది.
ఇందులో అత్యంత ఆధునికమైన డాటా లింక్ ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే రష్యన్ శాస్త్రవేత్తలు రూపొందించిన మిస్సైల్స్ ను చైనా కాపీ కొట్టిందని తెలుస్తోంది.