
గుజరాత్ లోని ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వల్సాద్ ఏరియాలో ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తుల కంపెనీలో ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేరనే తెలుస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.