
కమీషన్ ఏజెంట్లకు ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న నిరసన దేశం మొత్తం ఉందని, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. పంజాబ్‌లోని చాలా మంది కమిషన్ ఏజెంట్లు (ఆర్తియాస్) వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు పలికారు. కొద్ది రోజులుగా రైతుల నిరసనల్లో వీరు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కాగా తాజాగా వీరందరికీ ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. అంతే కాకుండా కొంత మంది కార్యాలయాలపై ఐటీ దాడులు కూడా జరిగాయి.