https://oktelugu.com/

ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్‌ తరహా ఘటన.. ఈసారి చిత్రకూట్‌ జిల్లాలో..

ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. హత్రాజ్‌ జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే చిత్రకూట్‌ జిల్లాలో మరో దారుణం జరిగింది. జిల్లాలోని మణిక్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడికి పాల్పడ్డ వారిలో మాజీ సర్పంచ్‌ కుమారుడు ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసులు పోస్టుమార్టం నివేదికలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 14, 2020 / 02:32 PM IST
    Follow us on

    ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. హత్రాజ్‌ జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే చిత్రకూట్‌ జిల్లాలో మరో దారుణం జరిగింది. జిల్లాలోని మణిక్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడికి పాల్పడ్డ వారిలో మాజీ సర్పంచ్‌ కుమారుడు ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసులు పోస్టుమార్టం నివేదికలో బాలికపై లైంగిక దాడి జరగలేదని , మరోసారి నమూనాలను ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ లాబోరేటరీకి పంపామని చిత్రకూట్‌ ఎస్పీ అంకిత్‌ మిట్టల్‌ తెలిపారు. కాగా నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.