https://oktelugu.com/

దారుణ ఆర్థికపతనం: భారత్‌ కంటే బంగ్లాదేశ్‌ ముందంజ..!

కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఇందులో అధిక జనాభా ఉన్న ఇండియా సైతం తీవ్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాదాపు ఏడాదికాలంగా జీడీపీ రేటు పెరగడం లేదని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఏకంగా 23.9 శాతం మేర జీడీపీ పడిపోయింది. ఆ తరువాత ఆన్‌లాక్‌ ప్రకటించినా కొన్ని రంగాలు మినహా మిగతావి ఇంకనూ ప్రారంభం కాకపోవడంతో జీడీపీ రేటు పెరగడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. Also Read: అందమైన అమ్మాయిలతో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 / 02:37 PM IST
    Follow us on

    కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఇందులో అధిక జనాభా ఉన్న ఇండియా సైతం తీవ్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాదాపు ఏడాదికాలంగా జీడీపీ రేటు పెరగడం లేదని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఏకంగా 23.9 శాతం మేర జీడీపీ పడిపోయింది. ఆ తరువాత ఆన్‌లాక్‌ ప్రకటించినా కొన్ని రంగాలు మినహా మిగతావి ఇంకనూ ప్రారంభం కాకపోవడంతో జీడీపీ రేటు పెరగడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: అందమైన అమ్మాయిలతో డేటింగ్ అంటూ దోచేస్తారు..

    అయితే తాజాగా ఐఎంఎఫ్‌ జీడీపీ అంచనాలను బట్టి చూస్తే పాకిస్తాన్‌, నేపాల్‌లాంటి చిన్న ఆర్థిక వ్యవస్థల కంటే ముందున్నా.. దక్షిణాసియాలో భూటాన్‌, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లు భారత్‌ అధిగమించడం ఆశ్చర్యం కలుగిస్తోంది.

    అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులతో 2021 మే 31 నాటికి భారత్‌లో తలసరి జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్థాయికి చేరుకొని 1877 డాలర్లకు పడిపోతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌ తలసరి జీడీపీ 4 శాతం వృద్ధితో 1888 డాలర్లకు చేరుతుందని తెలిపింది.

    జడీపీలో కొన్నేళ్ల క్రితం వరకు బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ మెరుగైన స్థితిలో ఉంది. ఎగుమతుల ప్రభావం పెట్టుబడులుకు ఆహ్వానించడం, వేగవంతమైన అభివృద్ధి ఇందుకు కలిసివచ్చాయి. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ జీడీపీ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పతనం 9.5 శాతం ఉంటుందని అంచనా వేయగా ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం 10.3 శాతం అంచనా వేసింది. ఇటలీ, స్పెయిన్‌ తరువాత భారీస్థాయిలో జీడీపీ పతనం అయిన దేశాల్లో భారత్‌ ఉండడం గమనార్హం.

    Also Read: చైనావోడి బరితెగింపు.. భారత్ ఆక్రమించిందంట.. అసలు కథేంటి?

    ఆన్‌లాక్‌ ద్వారా భారత్‌ జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. భారత్‌ 8.8 శాతం వృద్ధి రేటుతో బంగ్లాదేశ్‌ 5.4 శాతం, చైనా 8.2 శాతంను కూడా అధిగమిస్తుందని తెలిపింది. అప్పుడు భారత్‌ తలసరి జీడీపీ 2030 డాలర్లు ఉండగా బంగ్లాదేశ్‌ తలసరి జీడీపీ 1990 డాలర్లుగా ఉంటుందని తెలిపారు.