
సౌదీ అరేబియా నుంచి భారత్ కు త్వరలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని సౌదీలోని భారత రాయభారి ఔసఫ్ సయీద్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సౌదీలోని భారతరాయబారి కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సయీద్ విమాన సర్వీసులపై మాట్లాడారు. భారత్, సౌదీ అరెబియా మధ్య ప్రస్తుతం రెండు ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. భారత్ నుంచి సౌదీ అరేబియాకు వచ్చేవారు ఎక్కవ సంఖ్యలో ఉండడంతో చర్చలు జరుపుతున్నామన్నారు.