
కరోనా నివారణకు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ అభివ్రుద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై శనివారం మోదీ సమీక్షించారు. నగరంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను ఆయన సందర్శించారు. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు హాకీంపేటకు చేరుకున్న మోదీ ఆ తరువాత భారత్ బయోటెక్ సంస్థకు వెళ్లారు. ఆ సంస్థ ఎండీ క్రుష్ణ ఎల్లాతో పాటు ఇతర శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పర్యటను ఎలాంటి రాజకీయ నాయకులను కలిసేందుకు అనుమతి లేదు. కేవలం నలుగురు అధికారులు మాత్రమే సమీక్షలో పాల్గొన్నారు.