జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్లో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగులు ఉగ్రవాదులు హతమైనట్లు బుధవారం పోలీసులు తెలిపారు. లావేపోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి పోలీసులు కూంబింగ్ నిర్వహించారని, ఈ క్రమంలో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. దీంతో పోలీసులు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని వారు పేర్కొన్నారు. మంగళవారం రాత్రంగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయన్నారు. అయితే ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ […]
జమ్మూకాశ్మీర్లో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగులు ఉగ్రవాదులు హతమైనట్లు బుధవారం పోలీసులు తెలిపారు. లావేపోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి పోలీసులు కూంబింగ్ నిర్వహించారని, ఈ క్రమంలో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. దీంతో పోలీసులు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని వారు పేర్కొన్నారు. మంగళవారం రాత్రంగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయన్నారు. అయితే ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో సైనికుడు వికాస్ కుమార్ గాయపడ్డాడు.