టోల్ వసూళ్లను అడ్డుకున్న రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఉద్యమంలో భాగంగా శుక్రవారం హర్యానాలో టోల్ వసూళ్లను అడ్డుకున్నారు. చాలా చోట్ల టోల్ ప్లాజాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికుల నుంచి టోల్ వసూలు చేయకుండా వారిని వదిలిపెట్టారు. అలాగే కర్నాల్ లోని బస్తారా వద్ద ఎన్ఎచ్-44పై టోల్ ప్లాజా నిర్వహణను రైతులు అడ్డుకున్నారు. కర్నాల్-జింద్ హైవేపే, సిర్సా జిల్లాలోని దుబ్వాలి వద్ద ఖుయాన్ మల్కానా టోల్ ప్లాజాలో వసూలు ప్రక్రియను నిలిపివేశారు. ఈ సందర్భంగా భారతీయ […]

Written By: Velishala Suresh, Updated On : December 25, 2020 2:39 pm
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఉద్యమంలో భాగంగా శుక్రవారం హర్యానాలో టోల్ వసూళ్లను అడ్డుకున్నారు. చాలా చోట్ల టోల్ ప్లాజాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికుల నుంచి టోల్ వసూలు చేయకుండా వారిని వదిలిపెట్టారు. అలాగే కర్నాల్ లోని బస్తారా వద్ద ఎన్ఎచ్-44పై టోల్ ప్లాజా నిర్వహణను రైతులు అడ్డుకున్నారు. కర్నాల్-జింద్ హైవేపే, సిర్సా జిల్లాలోని దుబ్వాలి వద్ద ఖుయాన్ మల్కానా టోల్ ప్లాజాలో వసూలు ప్రక్రియను నిలిపివేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు మాట్లాడుతూ నేటి నుంచి మూడు రోజుల పాటు హర్యానాలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద వసూళ్లను అడ్డుకుంటామన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన సాగుతుందన్నారు.