Homeజాతీయం - అంతర్జాతీయంకెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరి మృతి

కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరి మృతి

మహారాష్ట్రలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. రాయగఢ్‌ జిల్లా ఖపోలీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఖపోలీ ప్రాంతంలోని సజ్‌గావ్‌ పారిశ్రామిక వాడలో ఉన్న ప్రీవీ ఆర్గానిక్స్‌ కెమెకల్‌ ప్లాంట్‌లో రాత్రి 2.30 గంటలలకు పేలుడు జరిగింని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ మహిళతో సహా ఇద్దరు మృతి చెందారన్నారు. అయితే మంటలను ఆర్పేందుకు 16 అగ్నిమాపక వాహనాలను రప్పించారన్నారు. కాగా మరికొంతమంది గాయపడగా వారిని ఖపోలీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular