పశుసంరక్షణ లేకపోతే ప్రయత్నాలు వృథానే: టెడ్రోస్ అధనామ్

వాతావరణ మార్పులతో పశు సంరక్షణ సరిగా నిర్వహించలేకపోతే ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు వృథా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఆదివారం తొలిసారి జరగనున్న ‘అంటువ్యాధుల సన్నద్ధత’ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తన సందేశం ఉన్న వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అధనామ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. అంటువ్యాధులు తలెత్తినప్పడు భయాందోళనకు గురికావడం, నివారణకు డబ్బులు ఖర్చుపెట్టడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ […]

Written By: Suresh, Updated On : December 27, 2020 9:54 am
Follow us on

వాతావరణ మార్పులతో పశు సంరక్షణ సరిగా నిర్వహించలేకపోతే ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు వృథా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఆదివారం తొలిసారి జరగనున్న ‘అంటువ్యాధుల సన్నద్ధత’ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తన సందేశం ఉన్న వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అధనామ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. అంటువ్యాధులు తలెత్తినప్పడు భయాందోళనకు గురికావడం, నివారణకు డబ్బులు ఖర్చుపెట్టడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఉపద్రవాలు మానవులు, జంతువుల, ప్రక్రుతి మధ్య అంతర్లీనంగా ఉంటుందన్నారు. ఈ బంధం దెబ్బతిన్నకొద్దీ విపత్తులు ఎదురువుతాయన్నారు.