
న్యూజిలాండ్ దేశం పరిధిలోని కెర్మాడెక్ దీవుల్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. కెర్మాడెక్ దీవుల్లో 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. గతంలోనూ కెర్మాడెక్ దీవుల్లో పలుసార్లు భూమి కంపించింది.కొత్త సంవత్సరం రోజే కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.