Brahmos Engineer Death: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. దీంతో చాలా దేశాలు భారత ఆయుధాల కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. సైనిక సహకారాన్ని కోరుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఓ యువ శాస్త్రవేత్త ఆకస్మిక మరణం.. ఇప్పుడు అనుమాణాలకు తావిస్తోంది. దీనిపై నేషనల్ మీడియా పెద్దగా దృష్టిసారించకపోవడం గమనార్హం.
బ్రహ్మోస్ 2.0 వర్షన్ రూపకల్పన..
30 ఏళ్ల ఈ యువ ఇంజినీర్ మరణం చుట్టూ అనేక అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకవైపు పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యం వినియోగించిన బ్రహ్మోస్ ప్రభావం ప్రపంచాన్ని ఊపేసింది. మరొకవైపు ఈ టెక్నాలజీ రహస్యాలను కాపాడే శాస్త్రవేత్త ఒకరు మిస్టరీగా అదృశ్యమవడం అనేక గూఢ నెట్‌వర్క్‌ల నడుమ సంబంధం ఉందనే వాదన బలపడుతోంది.
సీఐఏ టార్గెట్…
ఇది కొత్త కథేమీ కాదు. గతంలోనూ భారత శాస్త్రరంగాన్ని దెబ్బతీయడానికి విదేశి గూఢచార సంస్థలు ప్రయత్నించిన సంగతి రికార్డుల్లో ఉంది. 1995–2015 మధ్య ఇస్రో, బార్క్, డీఆర్డీవో వంటి కేంద్రాల్లో వందలాది శాస్త్రవేత్తలు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారని పలు రిపోర్టులు తెలుపుతున్నాయి. అమెరికా గూఢచారి యంత్రాంగం భారత శాస్త్రీయ పురోగతిని రూపకల్పన దశ నుంచే పర్యవేక్షించి, ఎదుగుతున్న మేధావులను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలు విస్తారంగా వినిపిస్తున్నాయి. చరిత్రను తిరగేస్తే హోమీ జే. బాబా, విక్రం సారాభాయి, లాల్‌బహదూర్ శాస్త్రి మరణాలు అన్నీ ఇప్పటికీ అనుమాన సూచికలుగా నిలిచాయి.
సాంకేతిక శక్తుల మధ్య కోల్డ్ వార్..
బ్రహ్మోస్ 2.0 వంటి అత్యాధునిక క్షిపణి ప్రాజెక్టులు భారత్, రష్యా భాగస్వామ్యాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీపై చైనాకు, అమెరికాకు, పాశ్చాత్య సమూహాలకు ఆందోళన సహజం. ఒక్క భారత్‌కే ఈ సాంకేతిక ఆధిక్యం లభించడం వారికి వ్యూహపరమైన దెబ్బగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో యువ ఇంజినీర్ మరణంపై సీఐఏ హస్తం ఉందన్న వాదన సర్వసాధారణ అనుమానం కాకపోవచ్చని భావిస్తున్నారు. యంగ్ టాలెంట్ అణచివేసే విధంగా భయ వాతావరణం సృష్టించడం కూడా గూఢ వ్యూహంగా పరిగణించవచ్చు.