Jubilee Hills By Election: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీకి చాలా కీలకంగా మారింది. ఈ మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నేతలకు ఇక్కడ గెలవడం చాలా అవసరం. ఇక్కడ ఓడితే ఆ నేతల ఇమేజ్ డ్యామేజ్ కావడం కాయం. అందుకే మూడు పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
రేవంత్ నాయకత్వంపై అసంతృప్తి..
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఇప్పటికే అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. మరోవైపు అధిష్టానం వద్ద కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతోది. ఇలాంటి తరుణంలో ఈ ఉపఎన్నిక గెలవకపోతే నాయకత్వ స్థిరత్వంపై సందేహాలు తీవ్రమవుతాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం మద్దతు తీసుకోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాట్రిక్స్ ఎలా కుదుటపడుతుందన్నది ప్రధాన ప్రశ్న.
కేటీఆర్‌కూ కీలకం..
2018, 2023లో బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించింది. మాగంటి గోపీనాత్ గెలిచారు. ఆయన మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. సిట్టింగ్ స్థానం నిలుపుకోవడానికి బీఆర్‌ఎస్ గోపీనాథ్ భార్యకు టికెట్ ఇచ్చింది. ఇక గోపీనాథ్‌ది ఆంధ్రా నేపథ్యం. జూబ్లీహిల్స్‌లో ఆంధ్రులు ఎక్కేవే. అయితే ఈసారి బీజేపీ కూడా ఆంధ్రా ఓటర్లకు గాలం వేస్తోంది. టీడీపీ రహస్యంగా మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ నాయకత్వానికి ఈ గెలుపు ఒక పరీక్ష. ఇక్కడ గెలిస్తే.. మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కేడర్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రజా సమస్యలపై దూకుడు పెంచే అవకాశం ఉంటుంది.
బీజేపీకీ కీలకమే..
రాంచందర్‌రావు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవీ. రాష్ట్ర పార్టీ, కేంద్ర బాధ్యతలు సమన్వయంగా నిర్వహించేవి కావడంతో బీజేపీ గెలుపు ద్వారా పార్టీ క్రెడిబిలిటీని బలోపేతం చేయాలని లక్ష్యం. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. అందుకే ఆ పార్టీకి గెలుపు తప్పనిసరి.
ముస్లిం ఓటర్లే కీలకం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.37 లక్షలమంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం తరఫున నవీన్ యాదవ్ పోటీ చేశారు. ఈసాకి కాంగ్రెస్ తరఫున బరిలో దిగాడు. మరోవైపు ఎంఐఎం ఈసారి కాంగ్రస్‌కు లోపాయకారి మద్తతు ఇస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఎంఐఎంకే 30 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018, 2023 ఎన్నికల్లో ముస్లింలు మాగంటి గోపీనాథ్‌కు అంగా నిలిచారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.
ప్రచార వ్యూహాలు
కాంగ్రెస్ పార్టీ.. ముస్లింల మద్దతు, అధికారంలో ఉండడం బలంగా భావిస్తోంది. అభివృద్ధిని కూడా ప్రచారం చేస్తోంది. ఇక బీఆర్‌ఎస్ గోపీనాథ్ చేసిన అభివృద్ధిపైనే నమ్మకంతో ఉన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. ఇక బీజేపీ కూడా కేంద్రం నిధులతో చేసిన అభివృద్ధి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో మరింత అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో రేసులో గెలుపు ఎవరిదో అని మూడు పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.