భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు లక్ష్యంపైనే గురిపెట్టాలని, ప్రస్తుతం సమస్యగా మారుతున్న వైరస్‌ను అంతమొందించడమే మన లక్ష్యమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు రాబోయే రోజుల్లో పండుగ సీజన్ మొదలవుతున్నందున ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. పండుగలను అడ్డం పెట్టుకొని గూమిగూడాల్సిన పని లేదన్నారు. వైరస్ ఇంకా తొలిగిపోనందును జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అసాధారణ పరిస్థితుల్లో మనం సాధారణ జీవనం గడపాలని సూచించారు. లేకుండా మనం చాలా చిక్కుల్లో పడుతామని హెచ్చరించారు. కరోనాపై భారత్ పోరాటం చేస్తోందని ఈ పోరాటానికి ప్రజల సహకారం అవసరముందన్నారు.