https://oktelugu.com/

బీజేపీలో చేరిన డీఎంకే నేత

భారతీయ జనతా పార్టీలోకి డీఎంకే నుండి సస్పెండయిన నేత, మాజీ ఎంపీ కేపీ రామలింగం శనివారం బీజేపీలో చేరారు. డీఎంకే అధినేత స్టాలిన్ కరోనా వైరస్ అంశంపై చేసిన ప్రతిపాదనను రామలింగం విమర్శించడంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. కాగా రామలింగం డీఎంకే మాజీ అధ్యక్షుడు అళగిరికి విధేయుడు. ఈ సందర్భంగా రామలింగం మాట్లాడుతూ అళిగిరిని కూడా బీజేపీలో చేరేలా ప్రయత్నిస్తానని చెప్పారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో రామలింగం కాషాయం […]

Written By: , Updated On : November 21, 2020 / 03:15 PM IST
Follow us on

భారతీయ జనతా పార్టీలోకి డీఎంకే నుండి సస్పెండయిన నేత, మాజీ ఎంపీ కేపీ రామలింగం శనివారం బీజేపీలో చేరారు. డీఎంకే అధినేత స్టాలిన్ కరోనా వైరస్ అంశంపై చేసిన ప్రతిపాదనను రామలింగం విమర్శించడంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. కాగా రామలింగం డీఎంకే మాజీ అధ్యక్షుడు అళగిరికి విధేయుడు. ఈ సందర్భంగా రామలింగం మాట్లాడుతూ అళిగిరిని కూడా బీజేపీలో చేరేలా ప్రయత్నిస్తానని చెప్పారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో రామలింగం కాషాయం కండువా కప్పుకున్నారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎంకే నేత బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తమిళనాడులో కాంగ్రెస్ నుంచి ఖుష్భూ చేరిన విషయం తెలిసిందే.