
ఉత్తరప్రదేశ్‌లో అనేక అభివృద్ధి పనులు చేసింది తమ ప్రభుత్వమే అని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి స్పష్టం చేశారు. తాము అప్పుడు చేసిన అభివృద్ధిని సమాజ్‌వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు తమ హయాంలలో జరిగినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. 2012 అనంతరం యూపీలో అభివృద్ధి ఏమీ జరగలేదని, గంగా ఎక్స్‌ప్రెస్ సహా ఇప్పుడు యూపీలో కనిపిస్తున్న అనేక అభివృద్ధి నమూనాలు బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవేనని మాయావతి అన్నారు.