
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 600 మందికి పైగా టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీడీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అణచివేత విచ్చలవిడిగా సాగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రాథమిక హక్కులు అణిచివేతపై కొందరు పోలీసులు శ్రద్ధ చూపుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పార్టీతో కుమ్మక్కవటం బాధాకరం. అసమ్మతి ప్రజాస్వామ్మానికి రక్షణ కవచం. టీడీపీ నేతలకు జారీ చేసిన నోటీసులే ఇందుకు నిదర్శనం. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని నోటీసుల్లో పేర్కొన్నారు.