
భారత్‌లో కరోనా బాధితుల గ్రాఫ్ గడచిన కొద్ది రోజులుగా తిరోగమనంలో కొనసాగుతోంది. దేశంలో సెప్టెంబరు నుంచి కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 91.78 లక్షల మంది కరోనా బాధితులు ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. కోవిడ్-19తో మృతి చెందినవారి సంఖ్య 1.45 శాతంగా ఉంది.