మహిళలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు పెడతామని కేరళ సీఎం పినరయి విజయన్ హెచ్చరించారు. మలయాళ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మితో పాటు పలువురు మహిళా సామాజిక కార్యకర్తలపై ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయింది. పోస్టు పెట్టిన వ్యక్తిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళలపై సోషల్ మీడియాలో వేధిస్తే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇష్టానుసారంగా పోస్టులు పెడితే ఊరుకునేది లేదన్నారు.
Also Read: అసోం మొదటి మహిళా సీఎం మృతి.