అసోం రాష్ట్ర మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. అస్ట్రేలియాలో తన కుమారుడి వద్ద ఉంటున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. అసోం రాష్ట్రంలో సైదా కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాలకు పైగా పనిచేశారు. 1980లో మొదటి సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1972,1978, 1983, 1991లలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సైదా మృతికి ప్రధాని మోది, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అసోం ప్రస్తుత సీఎం సర్బానద సోనోవాల్ సంతాపం ప్రకటించారు.
Also Read: మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడితె క్రిమినల్ చర్యలు..