
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తాజాగా ఆయన చేసుకున్న కరోనా టెస్టుల్లో పాజిటివ్ నిర్దారణ అయిందని సీఎం ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు అవసరమనుకుంటే టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తతం ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండడంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇటీవల ప్రజాప్రతినిధులకు కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ కర్ణాటక, హర్యానా, గోవా ముఖ్యమంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో ప్రజాప్రతినిధులకు పాజిటివ్ రిపోర్టు రావడం కలకలం రేపుతోంది.